గండిని తక్షణమే పూడ్చండి: మంత్రి

గండిని తక్షణమే పూడ్చండి: మంత్రి

ATP: జల్లిపల్లి సమీపంలో పీఏబీఆర్ కుడికాలువ వద్ద ఏర్పడిన గండిని తక్షణమే పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కలెక్టర్ ఆనంద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. నీరు వృథా కాకుండా ఉండేందుకు ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా నీటిని పెన్నా నదికి మళ్లించి, ఎంపీఆర్ డ్యామ్‌కు చేరేలా అధికారులు చేపట్టారు.