VIDEO: ఈ నెల 14 వరకు రైల్వే గేటు మూసివేత
W.G: పాలకొల్లు పట్టణంలోని రైల్వే గేటు మరమ్మత్తులు కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ముసివేశారు. ఆరు రోజులు పాటు మరమ్మత్తు పనులు జరుగుతాయని.. పనుల అనంతరం ఈ నెల 14వ తేదీన సాయంత్రం 7 గంటలకు రైల్వే గేటు తెరుస్తామని రైల్వే అధికారులు తెలిపారు. భీమవరం వైపు ప్రయాణించే వాహనాదారులు, ప్రజలు పూలపల్లి బైపాస్ రోడ్డు ద్వారా వెళ్లాలన్నారు.