'పని ప్రదేశంలో లైంగిక వేధింపులు జరగకుండా చూడాలి'
SRCL: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి పని ప్రదేశంలో ఇంటర్నల్ కమిటీ అంతర్గత కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమ అధికారి పీ.లక్ష్మీరాజ్యం సూచించారు. ఈరోజు అపరెల్ పార్కులోని పంక్చుయేట్ వరల్డ్ ప్రయివేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ఆవరణలో అంతర్గత కమిటీ పనితీరును పరిశీలించారు.