రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
NDL: చాగలమర్రి మండల పరిధిలోని పెద్ద భోదనం గ్రామ సమీపంలో బైక్ పై వెళుతున్న విద్యుత్ సిబ్బందిని సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ప్రసాద్ రెడ్డి (45) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తిరుపతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.