CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

CMRF చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

NLR: ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం నెల్లూరులో ఆయన 47 మంది పేదలకు 49,37,357 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి సహాయం పొందిన లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.