పుట్టపర్తిలో వైసీపీ ఎస్సీ విభాగం రివ్యూ మీటింగ్

సత్యసాయి: పుట్టపర్తిలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఎస్సీ సెల్ జిల్లా రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి సభ్యులకు సాధ్యమైనంత త్వరగా మండల, గ్రామ కమిటీలను నియమించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై పోరాటానికి గ్రామస్థాయి నుంచి సంసిద్ధం కావాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.