కోతుల గుంపులు.. భయంతో వణికిపోతున్న జనం

కోతుల గుంపులు.. భయంతో వణికిపోతున్న జనం

MDK: శివంపేట మండలంలో కోతుల గుంపులు గుంపులుగా వీరంగం సృష్టిస్తున్నాయి. అడవి నుంచి ఊర్లోకి చేరిన కోతులు పంటలను నాశనం చేయడమే కాకుండా, మనుషులపై దాడులు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. వీధుల్లో గుంపులుగా తిరుగుతుండటంతో బయటకు రావాలంటేనే గ్రామస్తులు వణికిపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతుల నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు.