సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? మాకు చెప్పండి: SP

KMR: సంక్రాంతి పండుగ సందర్బంగా ఇంటికి తాళమేసి ఊరెళ్తున్నారా ఐతే, అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు. పండుగ సందర్భంగా చాలా మంది తమ స్వస్థలాలకు వెళుతుంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. దొంగతనాల నియంత్రణకు.. తమ గ్రామాలకు వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని ఆమె సూచించారు.