'ముస్లింలకు సౌకర్యాలు కల్పించాలి'

'ముస్లింలకు సౌకర్యాలు కల్పించాలి'

VZM: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ఆదేశించారు. ముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల కోసం పనివేళల ముగింపుకు ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. మసీదులు, ముస్లిం ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేయాలన్నారు.