బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి: ఎస్పీ

NRPT: సమాజంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ శనివారం సూచించారు. జులై నెలలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో నారాయణపేట జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 56 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు చెప్పారు.