తిమ్మప్ప స్వామికి వైశాఖ మాస శుక్ల ఏకాదశి పూజలు

తిమ్మప్ప స్వామికి వైశాఖ మాస శుక్ల ఏకాదశి పూజలు

ATP: గుత్తి మండలం బసినేపల్లిలోని గుట్టపై వెలసిన శ్రీ గద్దెరాళ్ల తిమ్మప్పస్వామి ఆలయంలో గురువారం వైశాఖ మాస శుక్ల ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు సుదింద్రనాథ్ స్వామివారికి తులసి మాలతో అలంకరించి, పానకం, వడపప్పు నివేదించారు. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం పాటించారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.