రంపులు ఘాట్ రోడ్డులో విరిగి పడిన కొండచరియలు

రంపులు ఘాట్ రోడ్డులో విరిగి పడిన కొండచరియలు

ASR: జీకేవీధి మండలం రంపులు ఘాట్‌లో బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేడీపేట నుంచి చింతపల్లి వెళ్లే రహదారి మధ్యలో రంపులు ఘాట్ ఉంది. ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. భారీ వర్షాలకు కొండచరియలు, బండరాళ్లు, మట్టి పెళ్లలు జారి పడుతున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు జేసీబీ వాహనాలతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు.