ఉత్కంఠ రేపుతున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికలు
GNTR: తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత త్రీ మెన్ కమిటీ ఛైర్మన్ మంగమూరి హరిప్రసాద్, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ పోటీలో ఉన్నారు. కూటమి పెద్దల మద్దతు తమకే ఉందని ఇరువురు నేతలు పేర్కొంటూ ఈ నెల 7న నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.