శ్రీవారి సన్నిధిలో ఎంపీ అంబికా

ATP: తిరుమల శ్రీవారిని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. తన సతీమణితో కలిసి ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టాలని, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.