VIDEO: రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లు తొలగింపు
NLR: తుఫాన్ కారణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 28వ డివిజన్‌లోని చైతన్యపురి కాలనీలో రోడ్డు వైపు చెట్లు వాలిపోయి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో స్థానికులు టీడీపీ డివిజన్ ఇన్‌ఛార్జ్ సునీల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన శానిటేషన్ సిబ్బందికి చెప్పి చెట్లను తొలగించారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సునీల్ కోరారు.