మేడారం జాతరపై రాజకీయం వద్దు: మంత్రి సీతక్క

TG: గత ప్రభుత్వం మేడారం అభివృద్ధిని విస్మరించిందని మంత్రి సీతక్క ఆరోపించారు. 'మేడారం గద్దెల దగ్గర మార్పులు చేస్తున్నాం. మేము, పూజారులు చేసిన మార్పులపై సీఎం సంతృప్తి చెందలేదు. అందుకే ఆయనే స్వయంగా గద్దెల దగ్గరకు వస్తున్నారు. ఈ నెల 13న లేదా 14న సీఎం మేడారం పర్యటనకు వస్తారు. మేడారం జాతరపై రాజకీయం వద్దు, భక్తి భావంతో చూడాలి' అని పేర్కొన్నారు.