వేసవిలో విద్యుత్ కష్టాలు ఉండకూడదు: ఎమ్మెల్యే
E.G: రాజమండ్రి సిటీలో వేసవిలో లో వోల్టేజీ సమస్యలు లేకుండా చూడాలని APEPDCL అధికారులను MLA ఆదిరెడ్డి ఆదేశించారు. ఆదివారం తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో విద్యుత్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నగరంలో 88 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వేసవిలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.