జాతీయ పోటీలకు విద్యార్థులు ఎంపిక

జాతీయ పోటీలకు విద్యార్థులు ఎంపిక

ELR: నూజివీడు పట్టణంలోని శ్రీ మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న స్వాంతన్ కుమార్, భాను ప్రకాష్‌లు అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కబడ్డీ జాతీయ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాతూరి తేజేంద్ర సోమవారం తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది అభినందించారు.