VIDEO: 'శిధిలమైన భవనం తొలగించండి'
ELR: నూజివీడు పట్టణ పరిధిలోని గాంధీనగర్‌లో గల అప్పారావుపేటలోని మండల పరిషత్ ఫౌండేషన్ ప్లస్ పాఠశాల (ఎంపీ ఎలిమెంటరీ స్కూల్) ఆవరణములో పాత భవనం శిథిలావస్థ స్థితికి చేరుకుంది. చిన్నారి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. పొరపాటున పాత భవనంలోకి చిన్నారులు ప్రవేశిస్తే పొంచి ఉన్న ప్రమాదాన్ని ఊహించలేమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.