దోర్నాల మండలంలో దారుణ హత్య

దోర్నాల మండలంలో దారుణ హత్య

ప్రకాశం: దోర్నాల మండలం పెద్దమంతనాల గిరిజన గూడెంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో అర్తి అంకన్న (25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. మద్యం సేవించి భార్యను ప్రశ్నించిన అంకన్నపై, అతని పెద్దనాన్న కుమారుడు నాగన్న కత్తితో దాడి చేయడంతో అంకన్నఅక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.