బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
GDL: అయిజ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన కురువ వెంకట రాముడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఎమ్మెల్యే సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం నుంచి అతనికి రూ.4 లక్షలు మంజూరయ్యాయి. మంజూరైన ఎస్ఓసీని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆదివారం క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.