జపాన్‌లో భారతీయ సంప్రదాయ వడ్డన

జపాన్‌లో ఓ జంట నిర్వహిస్తున్న రెస్టారెంట్ భారతీయతకు నిలువెత్తు దర్పణంలా నిలుస్తోంది. ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ పేరిట నకాయామా, సచికో సాన్ దంపతులు దీనిని నడిపిస్తున్నారు. దక్షిణాది వంటకాలనూ తయారు చేయడంతో పాటు సచికో భారతీయ చీరను ధరించి వడిస్తున్నారు. భారతీయ సంప్రదాయంలో అందరిని నమస్కరిస్తూ, రాధాకృష్ణుల విగ్రహాలు, వీణ, మట్టి పాత్రలతో అలంకరించి భారతదేశంపై ప్రేమను చాటుతున్నారు.