అధ్వానంగా మారిన రోడ్డుతో గ్రామస్థుల ఇక్కట్లు
VKB: మోమిన్ పేట మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామంలో ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై గుంతలు, దెబ్బతిన్న కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే రోడ్డును మరమ్మతులు చేసి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించాలని సంబంధిత అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.