ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా లక్ష్మణ్

ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా లక్ష్మణ్

SRD: ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా జహీరాబాద్‌కు చెందిన బోడ లక్ష్మణ్ ఎన్నికయ్యారు. డెహ్రాడూన్‌లో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తనను జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. లక్ష్మణ్ ప్రస్తుతం సంఘం మెదక్ విభక్ మంత్రిగా పనిచేస్తున్నారు. తనకు జాతీయ కార్యవర్గంలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.