ప్రేమ జంట ఆత్మహత్య.. ఒకరు మృతి
SRPT: హుజూర్ నగర్లో ప్రేమజంట మధ్య జరిగిన చిన్న వాగ్వాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. నాలుగు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న నవీన్ (24), త్రిష అద్దె ఇంటిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. నిన్న గొడవ కారణంగా త్రిష తన చేతిని కోసుకోగా, భయంతో నవీన్ ఉరివేసుకుని చనిపోయాడు. త్రిషకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.