విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న భోగ శ్రావణి

JGL: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి పాల్గొన్నారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.