సోలార్ రూఫ్ టాప్ పవర్ ప్లాంట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
కోనసీమ: మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గురువారం రాయవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయంలో రూ.4.75 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసిన 10 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ పవర్ ప్లాంటు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నావుడు వెంకటరమణ, TDP నేతలు ఉండవెల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.