'వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'
TPT: గూడూరు జాతీయ రహదారి వద్ద శుక్రవారం హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు గూడూరు రూరల్ ఎస్సై తిరుపతయ్య జరిమానా విధించారు. అక్కడ అక్కడే వాహనదారులకు హెల్మెంట్ కొనిపించి అక్కడే తలకు ధరించేలా చేశారు. ఆయన మాట్లాడుతూ.. మనల్ని నమ్ముకున్న కుటుంబం కోసమే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు.