ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్

ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో రాత్రి మరోసారి క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో ఆ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. థరాలి మార్కెట్‌తో పాటు పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ బాలిక శిథిలాల్లో చిక్కుకుంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రహదారులు మూసుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.