'దశల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి'
NRPT: నారాయణపేటలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత అన్నారు. ఇవాళ ఆమె 14,15,16వ వార్డుల్లో కమిషనర్ నర్సయ్య, కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లను పరిశీలించి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.