మహిళా సంఘాల లోన్‌లను పెంచబోతున్నాం: ఎమ్మెల్యే

మహిళా సంఘాల లోన్‌లను పెంచబోతున్నాం: ఎమ్మెల్యే

MBNR: రాబోయే రోజుల్లో మహిళా సంఘాల లోన్‌లను పెంచబోతున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతామని పేర్కొన్నారు.