బోనమెత్తిన అర్బన్ ఎమ్మెల్యే
NZB: అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇవాళ కంఠేశ్వర్ 19వ డివిజన్‌లో జరిగిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీర్వాదాలు నిజామాబాద్ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ ఈ సందర్భంగా తెలిపారు.