ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

VSP: సబ్బవరంలోని ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రామచంద్రరావు తెలిపారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పి.వీరబాబు (19)గా గుర్తించారు. గురువారం వీరబాబు డిఫెన్స్ అకాడమీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.