VIDEO: నిర్మాణ కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు

WGL: రాయపర్తి మండలం కొండూరులో తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో శనివారం లేబర్ కార్డు దారులకు ఉచిత వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ మహమ్మద్ మసూద్, ఫర్జానా కార్మికుల నుంచి మూత్ర, రక్త నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కార్మికులకు 14 రకాల పరీక్షలు చేసి రిపోర్టులు పంపనున్నట్లు తెలిపారు.