పెదకాకానిలో పొదుపు మహిళలకి సహకారం
GNTR: పెదకాకాని మండలం పొదుపు మహిళా సభ్యులు సైనిక వెల్ఫేర్ ఫండ్‌కి రూ.72,250 విరాళం అందించారు. మంగళవారం జరిగిన కన్వర్జెన్సీ సమావేశంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సమక్షంలో ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాల సభ్యులను, అలాగే వారి తరఫున విరాళాలు సేకరించిన మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బచ్చల రాజును కలెక్టర్ అభినందించారు.