'ఇంటి స్థలం మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు'

KRNL: సొంతింటి స్థలము లేని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు కొరకు గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని గోనెగండ్ల మండలం తహసీల్దార్ కుమారస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఇంటి స్థలాలు పొందని వారు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధన మేరకు ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.