బంగారుపాళ్యం వివాహిత అదృశ్యం
CTR: బంగారుపాళ్యం మండలం పరిధిలో వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు సమాచారం మేరకు.. ఊటువంక గ్రామానికి చెందిన కే. భార్గవి (30) అనే మహిళ అక్టోబర్ 30న ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. భర్త హరికృష్ణతో సహా బంధువులు అన్ని ప్రాంతాల్లో వెతికినప్పటికి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.