రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం
TPT: పాకాల రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు ట్రైన్ కిందపడి వ్యక్తి మృతి చెందాడు. పాకాల భారతంమిట్ట ఏడవ క్రాస్ వీధికి చెందిన విశ్వనాథ నాయుడు సోమవారం హైదరాబాద్‌కు వెళుత్తుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.