రోగులకు మెరుగైన చికిత్స అందించాలి: కలెక్టర్

రోగులకు మెరుగైన చికిత్స అందించాలి: కలెక్టర్

MBNR: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.