లావేరు మండలంలో ఘనంగా గణనాధుని విగ్రహాల ఊరేగింపు

లావేరు మండలంలో ఘనంగా గణనాధుని విగ్రహాల ఊరేగింపు

శ్రీకాకుళం: లావేరు మండలంలోని తామాడ గ్రామంలో గణనాధుని ఊరేగింపు బాణాసంచా కాల్చులు, మంగళ వాయిద్యాల నడుమ సాగింది. వినాయక విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్టించే ముందు గ్రామ పుర వీధుల్లో ఊరేగింపును చేపట్టారు. అలాగే మండల వ్యాప్తంగా లక్ష్మీపురం, మురపాక, కేశవరాయునిపాలెం, వెంకటాపురం, బెజ్జిపురం పలు గ్రామాల్లో వినాయక మండపాలను యువకులు ఉత్సాహంగా ఏర్పాటు చేశారు.