విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ

CTR: పుంగనూరు పట్టణం తాటిమాకులపాళ్యం సమీపాన మినీ బైపాస్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొట్టింది. అయితే, ఈ మార్గం వాహనాల రాకపోకలతో ఎప్పుడు రద్దీగా ఉంటోంది. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు ఏ వాహనం అక్కడ లేదు. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటన వలన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.