శ్రీలీల 'పరాశక్తి' ప్రోమో సాంగ్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పరాశక్తి'. ఈ సినిమాలో అధర్వ, రవి మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. తాజాగా, మేకర్స్ ఈ చిత్రంలోని 'సింగరాళ సీతాకోక' అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.