వన భోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: వీరబాబు

KMM: డిసెంబర్ 1న రాజకీయ పార్టీలకు అతీతంగా కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహించే మాదిగల వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల నాయకులు కొమ్ము వీరబాబు, కొమ్ము రాఘవులు అన్నారు. శనివారం మాదిగల ఐక్యతను చాటాలని కోరుతూ తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిర్ర చిరంజీవి, నేలమరి సురేశ్, తదితరులు పాల్గొన్నారు.