ఇసుక లారీలను నియంత్రించాలని తాహాసీల్దార్‌కి వినతి

BDK: వెంకటాపురం-చర్ల ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ఇసుక లారీలను నియంత్రించి ప్రజలను దమ్ము, ధూళి నుంచి రక్షించాలని కోరుతూ.. శుక్రవారం సీపీఎం నాయకులు తాహాసీల్దార్‌కి వినతి పత్రం అందజేశారు. అధిక కాలుష్యం ద్వారా ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.