ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా

MHBD: ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన ఆదివారం మహబూబాబాద్-కేసముద్రం క్రాస్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. డోర్నకల్ మండలం చిలుకోడ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కేసముద్రం మిల్లుకు ధాన్యం తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ ఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.