గోరింటాడలో ఉచిత పశువైద్య శిబిరం
W.G: పాలకొల్లు మండలం గోరింటాడలో ఇవాళ వ్యవసాయ మార్కెట్ కమిటీ సహకారంతో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఏఎంసీ ఛైర్మన్ కోడి విజయభాస్కర్ శిబిరాన్ని ప్రారంభించారు. 28 పశువులకు గర్భకోశవ్యాధి చికిత్స, 145 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు, 45 పశువులకు నట్టల నివారణ మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డీడీ జాఫర్ హుస్సేన్, ఏడీ సత్యనారాయణ పాల్గొన్నారు.