'వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి'

'వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి'

VZM: జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలన్నీ సక్రమంగా కల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వసతి గృహాల నిర్వహణపై సాంఘిక సంక్షేమ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సహాయ అధికారులు,సాంఘిక సంక్షేమ గృహ అధికారులు పాల్గొన్నారు.