గాదిగూడ PHCలో స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపు
ADB: గాదిగూడ మండల కేంద్రంలోని PHC ఆసుపత్రిలో గురువారం 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా మొత్తం 258 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేయగా.. 36 మంది రోగులను చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో DRDO PD రాథోడ్ రవీందర్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీటి విలాస్ ఉన్నారు.