VIDEO: నర్సంపేట డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె
WGL: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా బుధవారం ఉదయం నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టి డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా ఆందోళనను చేశారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.