'10 సంవత్సరాల కృషి ఫలితమే పాలిటెక్నిక్ కళాశాల'
SRD: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఫ్రెషర్స్ పార్టీకి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది సంవత్సరాల కృషి మూలంగానే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు జరిగిందన్నారు. త్వరలో శాశ్వత భవనం ఏర్పాటు చేస్తామన్నారు.